గోపీచంద్ ఎట్టకేలకు ఆ స్టార్ హీరోయిన్ తో నటించనున్నాడు !

Published on Jul 27, 2018 7:00 pm IST

25 సినిమాలను పూర్తి చేసిన గోపీచంద్ దాదాపు ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ల అందరితోనూ కలిసి నటించాడు. ఒక్క కాజల్ తో తప్ప ఇప్పుడు ఈ అరుదైన కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుంది. నూతన దర్శకుడు కుమార్ సాయి తెరకెక్కించే చిత్రంలో గోపీచంద్ సరసన కాజల్ నటించనుందని సమాచారం. ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం యొక్క వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

వాస్తవానికి గోపీచంద్ తో కాజల్ ‘మొగుడు’ అనే చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ గోపిచంద్ కు జోడిగా కాజల్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ అప్పుడు ఆమె డేట్స్ దొరకకపోవడంతో ఆ స్థానంలో తాప్సీ ని తీసుకున్నారు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు గోపీచంద్, కాజల్ తో మొదటిసారి కలిసి నటించనున్నాడు.

సంబంధిత సమాచారం :