గోపిచంద్ “చాణక్య” ఆన్ లొకేషన్ ఫొటో- మాన్ ఇన్ బ్లాక్

Published on Jun 27, 2019 8:53 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ “చాణక్య”. డైరెక్టర్ తిరు యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. టెర్రరిజం, అసాంఘిక శక్తులపై హీరో చేసే పోరాటమే ప్రధాన కధాంశంగా తెరకెక్కనుందని సమాచారం. ఇటీవలే గోపిచంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది.

తాజాగా హీరో గోపి చంద్ ఆన్ లొకేషన్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. కళ్ళ జోడు నుండి కాళ్ళ బూట్ల వరకు నలుపు రంగు ధరింది వైల్డ్ సఫారీ వెహికిల్ లో కూర్చొని ఉన్న గోపి చంద్ ఫోటో ఆసక్తి కరంగాఉంది. ‘ఎఫ్2’ బేబీ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కిషోర్ గరికపాటి,అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More