ఇంటర్వ్యూ : గోపీచంద్ – చాణక్య అంచనాలను అందుకుంటాడు !

Published on Oct 4, 2019 4:44 pm IST

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో వస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా మెహ్రీన్ ఫిర్జా గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో గోపీచంద్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీ కోసం…

 

చాణక్య పై మీరు బాగా అంచనాలు పెట్టుకున్నారు. ఎలా అనిపిస్తోంది ?

చాణక్య అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా మా అంచనాలను అలాగే ప్రేక్షకుల అంచనాలను చాణక్య అందుకుంటాడనే నమ్మకం ఉంది.

 

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుది ?

ఫ్యామిలీస్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్ సినిమాలో ఉంది. మంచి యాక్షన్ ఉంది అలాగే సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది. ఆ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.

 

మీరు యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చేయడం ఫస్ట్ టైం కదా ?

అవునండి. ఈ జానర్ లో స్పై థ్రిల్ల‌ర్ నేనింతవరకూ చేయలేదు. దర్శకుడు తిరు ఈ సినిమా కథ చెప్పినప్పుడే నాకు చివరివరకూ ఒక ఇంట్రస్ట్ ఉంది అనిపించింది. అలాగే మంచి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయింది. ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు. అందుకే ఈ సినిమా చేశాను.

 

గోపీచంద్ అంటేనే మాస్. మరి ఈ సినిమాలో యాక్షన్ ఎంతవరకు ఉంటుంది ?

ఇది యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్. మీరు ఆశించిన్నట్లుగానే సినిమాలో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే గుడ్ ఫన్ కూడా ఉంటుంది. ఫిల్మ్ లో లాస్ట్ సీన్ వరకూ వాట్ నెస్ట్ అనే ఒక ఇంట్రస్ట్ ఉంటుంది.

 

నిర్మాత అనిల్ సుంకరగారి గురించి ?

ఆయన సినిమా బెస్ట్ అవుట్ ఫుట్ కోసం ఎప్పుడు తపన పడతారు. ప్రతి సినిమాని ఎంతో ఫ్యాషనేట్ గా చేస్తారు. ఆయనలాంటి నిర్మాతలు సినిమా ఇండస్ట్రీకి చాల అవసరం. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

 

ఈ సినిమా షూటింగ్ లో మీకు యాక్సిడెంట్ అయింది ?

అవును. ఓ యాక్షన్ సీక్వెన్స్ లో లాస్ట్ షాట్ చేస్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ ఒక్క షాట్ అయిపోతే షూటింగ్ అయిపోయేది కదా అనిపించింది. కానీ మన చేతుల్లో ఏమి ఉండదు కదా.

 

సైరాకి చాణక్యను పోటీగా ఎందుకు విడుదల చేస్తున్నారు ?

నిజానికి చాణక్య మూవీని మేము ‘మే’ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాము, కానీ, నేను గాయపడిన తరువాత షూటింగ్ ఆలస్యం అయింది. ఇక ఆ తరువాత, అక్టోబర్ 3న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాము, అప్పటికీ సైరా విడుదల తేదీ ప్రకటించలేదు. ఇక సైరా అక్టోబర్ 2 విడుదల అని ప్రకటించాక, మేము అక్టోబర్ 5న చాణక్య రిలీజ్ ప్లాన్ చేశాము.

 

దసరా హాలిడేస్ కాబట్టి రెండు సినిమాలను ఆదరిస్తారు ?

మేము కూడా అదే నమ్ముతున్నాము. దసరా హాలిడేస్ కాబట్టి చాణక్యను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. పైగా చాణక్య మరియు సైరా రెండు సినిమాలు వేరు వేరు నేపథ్యాలకి సంబంధించిన సినిమాలు.

 

మీ తదుపరి సినిమాలు గురించి ?

ప్రస్తుతం ప్రసాద్ గారి సినిమా చేస్తున్నాను. అది అయిపోయాక సంపత్ నంది సినిమా చేయాలి. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక తదుపరి సినిమాలు గురించి ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం :

More