హ్యాట్రిక్ కు రెడీ అవుతున్న గోపిచంద్ !

Gopichand11

ఇటీవల ‘పంతం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపిచంద్ కు ఆ చిత్రం అనుకున్నంతగా విజయాన్ని అందించలేకపోయింది. ఇక దాంతో కొంత గ్యాప్ తీసుకొని తనకు ‘లక్ష్యం , లౌక్యం’ రూపంలో సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

కాగా ఈచిత్రం ఇద్దరికి కీలకం కానుంది. ఇటీవల ‘సాక్ష్యం’ తో పరాజయాన్ని చవి చూశాడు శ్రీవాస్. ఇక లౌక్యం తరువాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచుస్తున్నాడు గోపిచంద్. మరి ఈచిత్రం వీరికి హ్యాట్రిక్ విజయాలను అందించి మళ్లీ వీరిద్దర్నీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

Exit mobile version