మాస్ ట్రైలర్ కట్ కి రెడీ అవుతున్న “సీటీమార్”

Published on Aug 27, 2021 9:00 am IST


టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఒక్కో అప్డేట్ ని అందిస్తున్న మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ ని అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు పెట్టిన ఓ ట్వీట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం సీటీమార్ మాస్ ట్రైలర్ కట్ కి ఇప్పుడు మణిశర్మ అందించిన సాలిడ్ డీటీఎస్ మిక్సింగ్ వర్క్ జరుగుతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ ట్రైలర్ ని అతి త్వరలోనే రిలీజ్ చెయ్యనున్నట్టుగా తెలిపారు. మరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణ సంస్థ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే సెప్టెంబర్ 3న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :