మాస్ పోస్టర్ తో “సీటీమార్” రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Aug 24, 2021 4:18 pm IST

మన టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”. తన దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ చిత్రం స్పోర్ట్స్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అయితే గత కొన్నాళ్ల నుంచి రిలీజ్ డేట్ విషయంలో నడుస్తున్న మిస్టరీకి ఈ చిత్రం థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అని మేకర్స్ కొన్ని రోజులు కితమే కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేసేసారు. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సెప్టెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక సాలిడ్ మాస్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. మంచి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టుగా గోపీచంద్ ఇందులో కనిపిస్తున్నాడు.

మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు ఈ డేట్ వచ్చేసింది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :