ఫుల్ మీల్స్ తో మాసివ్ గా ఉన్న “సీటీమార్” ట్రైలర్!

Published on Aug 31, 2021 3:25 pm IST

ప్రెజెంట్ లాక్ డౌన్ 2.0 తర్వాత మంచి హోప్స్ తో రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన “సీటీమార్” కూడా ఒకటి. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ మాస్ స్పోర్ట్స్ డ్రామా నుంచి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న అవైటెడ్ ట్రైలర్ ను మేకర్స్ ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఇది మాత్రం డెఫినెట్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు విజువల్స్ ఇందులో బాగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ లో కనిపించిన ప్రతీ ఒక్క నటుడు గోపీచంద్ నుంచి రావు రమేష్ వరకు ప్రతి ఒక్కరి రోల్ సాలిడ్ గా కనిపిస్తుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ లు అయితే చెప్పక్కర్లేదు.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంచి హిట్ అందుకోవాలని ప్లాన్ చేసారో ఏమో కానీ సంపత్ నంది పకట్బందీగా ప్లాన్ చేసినట్టు ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే ట్రైలర్ కి మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పి తీరాలి.

తమన్నా కూడా గ్లామర్ తో పాటు మంచి రోల్ లో కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఫుల్ మీల్స్ తో మాసివ్ గా ఈ ట్రైలర్ ఉంది. ఇక శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించిన ఈ అసలు ఫీస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :