ఉగాది స్పెషల్ గా ‘సిటీమార్’.. నిజమేనా ?

Published on Jan 24, 2021 3:00 am IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ చేస్తోన్న తాజా సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీని ఉగాది స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ పై అనేక రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఉగాది అంటున్నారు. మరి చూడాలి ఇందులో ఎంత నిజం ఉందో. ఇక ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అన్నట్టు ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. అయితే గోపీచంద్ ఎన్నో ఆశలతో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది.

సంబంధిత సమాచారం :