పెద్ది : ‘చికిరి చికిరి’ హుక్ స్టెప్ వెనకాల ఉన్నది ఎవరంటే..?

పెద్ది : ‘చికిరి చికిరి’ హుక్ స్టెప్ వెనకాల ఉన్నది ఎవరంటే..?

Published on Feb 13, 2026 10:04 AM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తు్న్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది.

ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘చికిరి చికిరి’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అయితే, ఈ పాటలో చరణ్ బ్యాట్ పట్టుకుని చేసిన హుక్ స్టెప్‌కు అదిరిపోయే క్రేజ్ దక్కింది. ఈ హుక్ స్టెప్‌ను యూత్ అందరూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. కాగా, ఈ హుక్ స్టెప్ వెనకాల ఉన్నది ఎవరనే విషయాన్ని తాజాగా జానీ మాస్టర్ రివీల్ చేశారు.

బ్యాట్‌తో చేసిన ఈ హుక్ స్టెప్ ఐడియా రామ్ చరణ్‌దే అని జానీ మాస్టర్ తెలిపారు. కానీ, ఈ విషయాన్ని ఆయన బయటకు చెప్పకుండా దాచారని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంతో మెగా ఫ్యాన్స్ చరణ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరాని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు