
గోపీచంద్‌ను యాంగ్రీ మ్యాన్‌గా, మంచి ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్‌గా నిలబెట్టిన సినిమాల్లో ‘యజ్ఞం’ మొదటి స్థానంలో నిలుస్తుంది. గోపీచంద్ స్టామినాను కొత్తగా పరిచయం చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ఏ.ఎస్.రవికుమార్ చౌదరితో గోపీచంద్ మళ్ళీ పదేళ్ళకు ఓ సినిమా చేయనుండడం విశేషంగా కనిపిస్తోంది. యజ్ఞం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే ఈ సినిమా నిన్నే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
తనకెంతో ఇష్టమైన దర్శకుడితో మరో కొత్త సినిమా చేయనుండడం పట్ల గోపీచంద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గోపీచంద్‌తో గతంలో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించనుంది. ఇక స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, శ్రీధర్ శ్రీపాన ఈ సినిమాకు రచయితలుగా పనిచేయనుండడం సినిమాపై ఇప్పట్నుంచే ఒక అంచనాను క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్నారు.

