కొత్త దర్శకుడితో పనిచేయాలనుకుంటున్న గోపిచంద్ !

Published on Jul 2, 2018 9:05 am IST

మాస్ హీరో గోపిచంద్ నటించిన తాజా చిత్రం ‘పంతం’ ఈ నెల 5న విడుదలకానుంది. గత కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కె. చక్రవర్తి డైరెక్ట్ చేయగా తన తర్వాతి సినిమాను కూడ కొత్త దర్శకుడితోనే చేస్తారట గోపిచంద్.

ఆ కొత్త దర్శకుడి పేరు కుమార్ సాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్.ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరు, చిత్రం ఎలా ఉండబోతోంది, ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :