అక్టోబర్ నుంచి మొదలుకానున్న యాక్షన్ హీరో సినిమా !

అక్టోబర్ నుంచి మొదలుకానున్న యాక్షన్ హీరో సినిమా !

Published on Aug 19, 2018 10:31 PM IST

గోపీచంద్ వరుసగా కొన్ని పరాజాయాల తర్వాత ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి నిర్మాణంలో కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. అది ప్రధానంగా లవ్ ఎంటర్టైనర్ తో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అట.

ఐతే ఈ చిత్రం తర్వాత గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం కథ ఫైనల్ అయిందని తెలుస్తోంది. సంపత్ నంది చెప్పిన కథ గోపిచంద్ కి బాగా నచ్చిందట. ఇక ఈ సినిమా అక్టోబర్ నుంచి పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. మరి ఈ సారైనా విజయం సాధిస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు