ఆగస్టులో ‘అలిమేలు మంగ’ మొదలు !

Published on Jun 5, 2021 12:02 am IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రాబోతున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. ఆగస్టు ఫస్ట్ వీక్ నుండి ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేయాలని తేజ ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది. నిజానికి జూన్ నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేసినా కరోనా సెకెండ్ వీక్ కారణంగా ఆగస్టుకి పోస్ట్ ఫోన్ అయింది.

కాగా తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ ‘ఒక హీరో’గా చేస్తోన్న మొదటి సినిమా ఇది. కాగా తేజ, గోపీచంద్‌ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న సినిమా కోసం తేజ ఓ వైవిధ్యమైన నేపథ్యంతో విభిన్నమైన కథని రాశాడట. అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను తేజ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :