యాక్షన్ హీరో గోపీచంద్ తదుపరి సినిమా సెప్టెంబర్ లో మనముందుకు రానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నాడు. రాకుల్ ప్రీత్ సింగ్ కధానాయిక . ఈ సినిమా టాకీ భాగం ఈ నెల 11కి ముగుస్తుంది. క్లైమాక్స్ ని ఈ నేలాఖరివరకూ చిత్రీకరిస్తారు
దీని తరువాత ఫారెన్ లోకేషన్లలో 3 పాటల చిత్రీకరణతో షూటింగ్ మొత్తం ముగుస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. కోనా వెంకట్ మరియు గోపీ మోహన్ లు స్క్రీన్ ప్లే సహకారం అందించారు. శ్రీధర్ స్పందన సంభాషణలు అందిస్తున్నారు
గోపీచంద్ సొంత బ్యానర్ అయిన భవ్య క్రియేషన్స్ బ్యానర్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తుంది


