మలయాళ దర్శకుడితో యాక్షన్ హీరో !

Published on Sep 22, 2019 7:33 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో వస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌తో అక్టోబర్ 5న ప్రేక్షకుల రాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే సంపత్ నంది – గోపీచంద్ కాంబినేషన్ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో ఓ సినిమా రాబోతుంది. సంపత్ నంది, గోపీచంద్ కోసం ఓ మంచి కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. కాకపోతే ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ సినిమా తరువాత గోపీచంద్ ఓ మలయాళ దర్శకుడితో పని చేయబోతున్నాడు.

కాగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ.. ‘సంపత్‌ నందితో చేసే సినిమా తరువాత, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారి బ్యానర్‌ లో మలయాళ దర్శకుడు బినుతో ఓ సినిమా చేస్తున్నానని.. అలాగే తనకు మల్టీస్టారర్‌ చేయాలని ఉందని.. కాకపోతే మంచి కథ కుదరడం లేదని.. ఇటీవల ఓ దర్శకుడు కథ చెప్పినా.. ఆ కథలోని క్యారెక్టర్‌ లో దమ్ములేదని చెప్పుకొచ్చాడు. గోపీచంద్ ఇంకా మాట్లాడుతూ.. ‘మంచి కథ కుదిరితే ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ సినిమా కూడా ఒకటి చేయాలనుకుంటున్నానని చెప్పారు.

ఇక చాణక్య సినిమాకి వస్తే.. ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని.. ఈ చిత్రం అవుట్ ఫుట్ పై గోపీచంద్ చాల నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More