పాత కాంబినేషన్స్ సెట్ చేస్తోన్న గోపీచంద్!

Gopichand
‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్’.. ఈ మధ్యకాలంలో ఇలా వరుస సినిమాలతో మెప్పిస్తూ వచ్చిన గోపీచంద్, దర్శకుడు ఏ.ఎస్.రవి కుమార్‌తో సౌఖ్యం పేరుతో ఓ సినిమాను సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ నెలాఖర్లో విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను పూర్తి చేయడంతో పాటు బీ. గోపాల్‌తో కూడా ఓ సినిమా చేస్తోన్న గోపీచంద్ ఆ సినిమాను కూడా చివరిదశకు తెచ్చారు. ఇక దీంతో గోపీచంద్ అప్పుడే తాను నటించబోయే తదుపరి సినిమాలను కూడా లైన్లో పెట్టేశారు.

గోపీచంద్‌తో 2005లో ఆంధ్రుడు పేరుతో హిట్ సినిమా తీసిన పరుచూరి మురళి దర్శకత్వంలో గోపీచంద్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా గోపీచంద్ స్ట్రాటజీ చూస్తే తనతో పనిచేసిన దర్శకులనే మళ్ళీ రిపీట్ చేస్తూ హిట్ కొడుతూ వస్తూ ఆ ట్రెండ్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘లక్ష్యం’ సినిమాతో హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్‌తో ‘లౌక్యం’, ‘ఒక్కడున్నాడు’తో సరికొత్త ప్రయోగాన్ని అందించిన చంద్రశేఖర్ ఏలేటితో ‘సాహసం’, ‘యజ్ఞం’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన రవికుమార్ చౌదరితో ‘సౌఖ్యం’, ఇప్పుడు ‘ఆంధ్రుడు’ దర్శకుడు పరుచూరి మురళితో మరో సినిమా.. ఇలా వరుసగా దర్శకులతో కాంబినేషన్స్‌ను రిపీట్ చేస్తూ హిట్ కొడుతోన్న గోపీచంద్‌కి ఈ సెంటిమెంట్ సరిగ్గానే వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

Exit mobile version