యాక్షన్ హీరో గోపీచంద్ చేస్తున్న తాజా చిత్రం ‘పంతం’. నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో ఈ చిత్ర్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ పోర్షన్ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇది పూర్తికాగానే మిగిలిన టాకీ పార్ట్, పాటల్ని యూకేలో చిత్రీకరించనున్నారు టీమ్.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి చేస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ నటిస్తోంది. జూలై 5వ తేదీన విడుదలకానున్న ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గోపీచంద్ భావిస్తున్నారు.


