మల్టీస్టారర్ కోసం ప్రయత్నిస్తున్న స్టార్ రైటర్ !
Published on Jun 13, 2018 11:53 pm IST

నాగార్జున ‘సంతోషం’ చిత్రంతో స్క్రీన్ ప్లే రైటర్ గా పరిచయమయ్యారు గోపిమోహన్. ఆ తర్వాత శ్రీనివైట్ల, కోన వెంకట్ కాంబినేషన్ లో దాదాపు పదమూడు సంవత్సరాల పాటు విజయపరంపర కొనసాగించారు.

బాద్‍షా చిత్రం వరకు స్టార్ రైటర్ గా ఒక వెలుగు వెలిగిన గోపీమోహన్, ఆ తర్వాత చేసిన చిత్రాలన్నీ ప్లాప్ అవ్వడం, తనే స్వయంగా కథ అందించిన ‘మిస్టర్’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇక రైటర్ గా గ్యాప్ ఇచ్చి డైరెక్టర్ గా మారబోతున్నారు. గతంలోనే డైరెక్టర్ గా సునీల్ తో ఒక చిత్రాన్ని ప్లాన్ చేయగా అది మధ్యలోనే ఆగిపోయింది.

ఈసారి సునీల్ కాకుండా ముగ్గురు హీరోలు ఉండే కథని రెడీ చేశారు. ఆ ముగ్గురు హీరోల పాత్రల్లోనూ ఫామ్ లో ఉన్న హీరోలనే తీసుకోని ఒక మల్టీస్టారర్ తెరకెక్కించాలని గోపిమోహన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నాగశౌర్యతో చర్చించిన గోపిమోహన్, మెయిన్ హీరోగా అఖిల్ ను ఒప్పించటానికి పూర్తి స్క్రిప్ట్ తో రెడీ అయినట్టు తెలుస్తోంది. అఖిల్ కథ విని అంగీకరిస్తే త్వరలో రైటర్ గోపిమోహన్ నుండి ఒక మల్టీస్టారర్ వస్తుంది.

 
Like us on Facebook