కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన గోపిచంద్

కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన గోపిచంద్

Published on Sep 13, 2019 7:45 PM IST

గొపిచంద్ ప్రస్తుతం ‘చాణక్య’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తిరు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఆ ఉత్సాహంలోనే గోపీచంద్ తన కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. ఈరోజు ఉదయమే సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

నూతన దర్శకుడు బిను సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. రెగ్యులర్ షూట్ ఈ నెల 20వ తేదీ నుండి జరగనుంది. ఇకపోతే ఇందులో హీరోయిన్ ఎవరు, సినిమా ఎలా ఉండబోతోంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు