షాలినీ పాండేతో థాయ్‌ ల్యాండ్ గొరిల్లా !

షాలినీ పాండేతో థాయ్‌ ల్యాండ్ గొరిల్లా !

Published on May 28, 2019 12:00 AM IST

వెండితెర‌మీద సాహ‌స‌వంత‌మైన హీరోలు, వారికి సాయం చేసే జంతువులు అనేది ఎవ‌ర్‌ గ్రీన్ కాన్సెప్ట్. నిన్న‌టికి నిన్న విడుద‌లై సంచ‌నాలు సృష్టిస్తున్న `అలాద్దీన్‌`లోనూ కోతిపిల్ల అశేష‌ ప్ర‌జానీకాన్ని ఆక‌ట్టుకుంటోంది. తాజాగా మ‌న ద‌క్షిణాది సినిమాలోనూ ఓ గొరిల్లా హ‌ల్ చ‌ల్ చేయ‌నుంది. `రంగం` ఫేమ్ జీవా హీరోగా న‌టించిన `గొరిల్లా`లో ఈ సంద‌డి క‌నిపించ‌నుంది. షాలినీ పాండే ఇందులో హీరోయిన్ నటించింది. డాన్ శాండీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఆల్ ఇన్ పిక్చ‌ర్స్ పై గంగా శ‌బ‌రీష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బ్యాంకును కొల్ల‌గొట్ట‌డానికి ఓ బృందానికి గొరిల్లా చేసిన సాయం ఏంటి ? అస‌లు ఆ బృందం ఆ ప‌నిలో నిమ‌గ్నం కావ‌డానికి కార‌ణాలు ఏంటి ? అనే పాయింట్‌ తో ఈ చిత్రం తెర‌కెక్కిందట. కాంగ్ అనే గొరిల్లాను థాయ్‌ ల్యాండ్ నుంచి ఈ సినిమా కోసం తీసుకొచ్చి మరీ షూట్ చేశారు. థాయ్‌ ల్యాండ్‌లోని సాముట్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో శిక్ష‌ణ పొందిన గొరిల్లా ఇది. అయితే షాలినీ పాండేకి గొరిల్లాకి మధ్య సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయట.

కాగా త్వ‌ర‌లోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను, పాట‌ల‌ను విడుద‌ల చేయనున్నారు. ఇక జూన్ 21న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు