మహేష్ కి ఇష్టమైన వ్యక్తి నుండి విషెస్ !

Published on Aug 9, 2020 4:20 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన‌రోజు సందర్భంగా తోటి స్టార్ హీరోలు అండ్ అభిమానులు మహేష్ కి తమ స్వీట్ విషెస్ తెలుపుతున్నారు. అయితే మహేష్ కి అత్యంత ఇష్టమైన తన కుమారుడు ఘట్టమనేని గౌతమ్ కూడా తన తండ్రికి బెస్ట్ విషెస్ తెలిపాడు. సోషల్ మీడియాలో తన స్వీట్ విషెస్ తెలుపుతూ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను మహెహ్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నేటితో 45వ పుట్టిన‌రోజు జరుపుకుంటున్నారు. మొత్తానికి ఈ రోజు అంతా సోషల్ మీడియాలో మహేష్ మేనియానే నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ సెల‌బ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలుపుతూ ‘‘అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేష్. ఈ ఏడాది మీకు అద్భుత విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను’’ అని పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More