గౌతమ్ మీనన్ కూడా స్టార్ట్ చేశాడు జయలలిత బయోపిక్ !

Published on Dec 24, 2018 3:54 pm IST

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి, పురుచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ బయోపిక్ లో రమ్యకృష్ణ , జయలలిత పాత్రలో నటిస్తుండగా శోభన్ బాబు పాత్రలో యాక్టర్ వంశీ అలాగే ఎంజీఆర్ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్ నటిస్తున్నారు. మూడు సీజన్లుగా రానున్న ఈ సిరీస్ ప్రస్తుతం సీజన్ 1యొక్క చిత్రీకరణ ఏ వి యం స్టూడియోస్ లో జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ ను మంచి క్వాలిటీ తో నిర్మిస్తున్నారట జయలలిత క్లోజ్ ఫ్రెండ్స్.

ఇక ఇది ఇలావుంటే దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో జయలలిత బయోపిక్ ను తెరకెక్కిస్తుంది. ఈచిత్రంలో నిత్య మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. అలాగే తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ కూడా అమ్మ జీవితం ఆదారంగా ఒక బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు.

సంబంధిత సమాచారం :