నైజాంలో ‘పెద్ది’కి గుడ్ న్యూస్.. టికెట్ రేట్ల పెంపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

నైజాంలో ‘పెద్ది’కి గుడ్ న్యూస్.. టికెట్ రేట్ల పెంపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

Published on Jun 3, 2026 12:00 AM IST

‘పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తాజగా విడుదల అయ్యాయి.

‘పెద్ది’ చిత్రానికి మల్టీప్లెక్స్‌లలో రూ.150, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 వరకు టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక ఈ పెంపు 10 రోజుల పాటు ఉండనుంది. ఈ పది రోజులు 5 షోలు వేసుకునేందుకు సర్కార్ ఓకే చెప్పింది. దీంతో పాటు జూన్ 3న ఒక స్పెషల్ ప్రీమియర్ షో వేసుకునేందుకు కూడా సర్కార్ అంగీకరించింది. ఈ స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర గరిష్టంగా రూ.600 వరకు నిర్ణయించింది.

ఇప్పటికే ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు సానుకూల రెస్పాన్స్ రావడం.. ఇప్పుడు నైజాంలో కూడా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి రావడంతో ‘పెద్ది’ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన నైజాం టికెట్ బుకింగ్స్ ఇందాకే తెరుచుకున్నాయి.

తాజా వార్తలు