‘గోవిందుడు అందరివాడేలే’ పొల్లాచ్చి షెడ్యూల్ కంప్లీటెడ్..!

Published on Jul 28, 2014 6:31 pm IST

govindudu-andarivadele

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి కాంబినేషన్లో రూపొందుతున్న కుటుంబ కధా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. గత కొన్ని రోజుల క్రితం పొల్లాచ్చిలో మొదలైన షెడ్యూల్ సోమవారంతో పూర్తయింది. ఈ షెడ్యూల్లో ప్రకాష్ రాజ్, రామ్ చరణ్, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్ లపై పల్లెటూరి వాతావరణం నేపధ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సన్నివేశాలన్ని చాలా అద్బుతంగా వచ్చాయని ప్రకాష్ రాజ్ తెలిపారు.

పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లో ఈ సినిమా ఒక ఆణిముత్యంలా నిలిచిపోవాలని దర్శకనిర్మాతలు శ్రమిస్తున్నారు. జయసుధ, కమలిని ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :