టీజర్ టాక్ : కలర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘గోవిందుడు అందరివాడేలే’

టీజర్ టాక్ : కలర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘గోవిందుడు అందరివాడేలే’

Published on Aug 8, 2014 1:17 AM IST

govindudu-andarivadele

కృష్ణవంశీ గత కొన్నేళ్ళుగా ఫ్లాప్ సినిమాలు మాత్రమే తీస్తున్నా బండ్ల గణేష్ వంటి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్, రామ్ చరణ్ వంటి టాప్ హీరో కలిసి అందాల భామ కాజల్ తో జోడికట్టి, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీలు ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’

ఈ సినిమా యొక్క ఫస్ట్ టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ 39 సెకన్ల వీడియోని చూస్తుంటే చెర్రీని ఇప్పటివరకూ ఎవరూ చూపించని యాంగిల్ లో, కృష్ణవంశీ ట్రేడ్ మార్క్ షాట్స్ తో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ముస్తాబవుతున్నట్లు తెలుస్తుంది. కొందరైతే కృష్ణవంశీని టాలీవుడ్ సంజయ్ లీలా భన్సాలీగా అభివర్ణిస్తున్నారు, ఈ వేడుకలో వంశీ మాట్లాడిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది

ఈ చిత్రం ఎట్టిపరిస్థితులలో అక్టోబర్ 1న మనముందుకు తీసుకొస్తామని రామ్ చరణ్ తెలిపాడు. యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు

తాజా వార్తలు