‘గోవిందుడు..’లో రామ్ చరణ్ విలన్ అతడే..!

Published on Jul 30, 2014 5:21 pm IST

adarsh-bala-krishna

ఆదర్శ్ బాలకృష్ణ.. ‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. కొంచం నెగటివ్ ఛాయలున్న పాత్రలో నటించాడు. తర్వాత కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ సినిమాలో ఒక హీరోగా చేశాడు. తాజాగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో పూర్తి స్థాయి విలన్ గా మారుతున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు..’లో విలన్ పాత్ర తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ తమిళనాడులో కారైకుడిలో జరుగుతుంది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణవంశి దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :