తమిళ్ లో రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’

తమిళ్ లో రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’

Published on Feb 25, 2015 4:37 PM IST

Govindudu-Andarivadele
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో మొదటగా చేసిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమా గత ఏడాది దసరా కానుకగా విడుదలై సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రామ్ చరణ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ని తెచ్చి పెట్టింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమాని తమిళంలో రిలీజ్ చెయ్యడానికి సిద్దమవుతున్నారు. తమిళంలో ఈ సినిమాకి ‘రామ్ లీల’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

తమిళంలో కూడా రామ్ చరణ్ కి డీసెంట్ మార్కెట్ ఉంది. గతంలో రామ్ చరణ్ నటించిన ‘మావీరాన్’ (మగధీర డబ్ వెర్షన్) సినిమా అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాకి అక్కడ బాగానే క్రేజ్ ఉంది. అలాగే తమిళంలో కూడా బాగా ఫేమస్ అవడమే కాకుండా అక్కడి స్టార్ హీరోలతో సినిమా చేస్తున్న కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఉండడంతో తమిళ నిర్మాతలు అక్కడ కూడా విజయం సాధిస్తుందని అంటున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు