మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ పోనీ టెయిల్ లుక్ లో కనిపించనున్నాడు. దసరా కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా అభిమానులకు పండగ తీసుకురావడం ఖాయమని నిర్మాత ధీమాగా చెప్తున్నారు.
‘ ఇప్పుడే ‘గోవిందుడు అందరివాడేలే’ ట్రైలర్ చూశాను. సూపర్… అభిమానులు ఎప్పుడు ఈ ట్రైలర్ చూస్తారో అని ఆశగా చూస్తున్నాను. కాంట్ వెయిట్ ఫర్ ద ఫ్యాన్స్ టు సి ఇట్. మా గోవిందుడిని ఇన్ని రంగుల మధ్య అన్ని హంగులతో చూస్తూనే ఈ దసరాకి పండగే ‘ అంటూ ట్వీట్ చేశారు.
రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


