బన్నీకి కథ నచ్చిందట !

బన్నీకి కథ నచ్చిందట !

Published on May 9, 2021 3:00 AM IST

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అల్లు అర్జున్ కి కథ చెప్పాడని, కథ బన్నీకి బాగా నచ్చిందని, దాంతో గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి బన్నీ ఇంట్రస్ట్ గా ఉన్నాడట. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి ఫుల్ స్క్రిప్ట్ కూడా రాశాడు. త్వరలోనే అల్లు అరవింద్ కి కథ చెప్పనున్నాడని.. కథ విని అల్లు అరవింద్ బాగుందని ఫీల్ అయితే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే.. నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెడతారట. కాగా క్రేజీ ఎమోషనల్ బ్యాక్‌ డ్రాప్‌ తో గౌతమ్ ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఎలాగూ గౌతమ్, బన్నీ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి కాబట్టి.. సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకువచ్చే అవకాశం ఉంది.

పైగా గౌతమ్ ‘జెర్సీ’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ‘జెర్సీ’ తెలుగులో సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు