మహేష్ బాబు తల్లిగా గ్రేసీ సింగ్..?

మహేష్ బాబు తల్లిగా గ్రేసీ సింగ్..?

Published on Jan 18, 2015 11:37 AM IST

Gracy-Singh-Mahesh
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో తల్లి పాత్రలో నటింపజేయడానికి గ్రేసీ సింగ్ ను సంప్రదించినట్టు సమాచారం. ఈ వార్త ఫిల్మ్ నగర్ ప్రముఖులతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘సంతోషం’ సినిమాతో గ్రేసీ సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అమీర్ ఖాన్ నటించిన ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ ‘లగాన్’లో కూడా ఆమె హీరోయిన్.

మహేష్ బాబు సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు