ఎన్.టి.ఆర్ తనయుడి గ్రాండ్ బర్త్ డే సెలబ్రేషన్స్

ఎన్.టి.ఆర్ తనయుడి గ్రాండ్ బర్త్ డే సెలబ్రేషన్స్

Published on Jul 22, 2015 11:59 AM IST

ntr-son
నందమూరి తారకరామారావు ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకూ మూడు తరాల వారసులు హీరోలుగా మారి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిలో నేటి తరం కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఏడాది క్రితం ఎన్.టి.ఆర్ నాలుగవ తరం నందమూరి వారసుడికి తండ్రి అయ్యాడు. తన పేరే నందమూరి అభయ్ రామ్. నేను అభయ్ రామ్ పుట్టిన రోజు. దాంతో నందమూరి ఫ్యామిలీ మరియు నందమూరి అభిమానులు అభయ్ రామ్ బిత్ డే వేడుకలని ఘనంగా చేయడానికి ప్లాన్ చేసారు. బర్త్ డే రోజున ఎన్.టి.ఆర్ లండన్ నుంచి రాలేకపోవడంతో అభయ్ రామ్ వైఫ్ ప్రణతి మరియు క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి హైదరబాద్ లో తయారు చేయించిన 3.5 కేజీల స్పెషల్ కేక్ తో లండన్ కి వెళ్ళారు. ఈ రోజు ఉదయం అక్కడ బర్త్ డే ని సెలబ్రేట్ చేసారు.

ఇదిలా ఉంటే ఎన్.టి.ఆర్ అభిమానులు కూడా జోరుగా అభయ్ రామ్ బర్త్ డే ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అభయ్ రామ్ బర్త్ డే కేక్ ని కట్ చేయడమే కాకుండా ఇరు రాష్ట్రాల్లో పలు సామాజిక కార్యక్రమాలు మరియు చారిటీలకి పలు ఐటమ్స్ ని అందించనున్నారు. అంతే కాకుండా నందమూరి అభిమానులు #HappyBirthdayAbhayRam అనే హాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అభయ్ రామ్ మొదటి బర్త్ డే కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.

తాజా వార్తలు