‘మహర్షి’ 50డేస్ 200 సెంటర్స్-విజయోత్సవ వేడుక

Published on Jun 24, 2019 9:00 pm IST

ప్రిన్స్ మహేష్,అల్లరి నరేష్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరక్కిక్కిన “మహర్షి” మూవీ ఘనవిజయం నమోదుచేసింది. సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి వంశీ పైడిపల్లి చక్కగా తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ముఖ్యంగా నైజాం ఏరియాలో రికార్డు వసూళ్లు సాధించింది.

తాజాగా ఈ మూవీ ఏకంగా 200సెంటర్స్ లో 50రోజులుపూర్తి చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ నేల 28వ తేదీన సాయంత్రం 6గంటలకు శిల్పకళావేదికలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియాజేస్తూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేశారు. దిల్ రాజు,అశ్వని దత్,పరం వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ కి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.

సంబంధిత సమాచారం :

More