‘బ్రో’ ట్రైలర్ రిలీజ్ కి గ్రాండ్ ప్లానింగ్స్ ?

‘బ్రో’ ట్రైలర్ రిలీజ్ కి గ్రాండ్ ప్లానింగ్స్ ?

Published on Jul 21, 2023 1:00 AM IST

BRO 8

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో. తమిళ హిట్ మూవీ వినోదయ సిత్తం కి రీమేక్ గా తెరకెక్కుతున్న బ్రో మూవీ జులై 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ మరొక్కసారి దేవుడిగా కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న బ్రో మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మించాయి.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ట్రైలర్ ని ఈనెల 22న తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ లలో ఒకేసారి గ్రాండ్ గా ఫ్యాన్స్ సమక్షంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై వారి నుండి అఫీషియల్ గా ప్రకటన అయితే రావాల్సి ఉంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పారిచిన బ్రో మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు