గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ చేతికి గోపీచంద్ ‘జిల్’.?

గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ చేతికి గోపీచంద్ ‘జిల్’.?

Published on Jan 15, 2015 4:37 PM IST

jil

మాచో హీరో గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ సినిమా ఇటీవలే విడుదలై విజయం సాధించింది. అలాగే గోపీచంద్ ఆ తర్వాత స్టార్ట్ చేసిన తన తదుపరి సినిమా ‘జిల్’ ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన షూటింగ్ జనవరి చివరికల్లా ఫినిష్ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారు. కానీ త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ఫిబ్రవరి చివర్లో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. గోపీచంద్ సరసన ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు