‘గుణ’ దూసుకొస్తున్నాడు

Published on Jun 16, 2019 5:57 pm IST

గత ఏడాది విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం అంత పెద్ద హిట్టవడానికి ప్రధాన కారణం అందులోని వాస్తవ కథే. ఈ ఫార్ములాను గట్టిగా నమ్మిన హీరో కార్తికేయ మళ్ళీ దాన్నే ఫాలో అయ్యారు. అర్జున్ జంధ్యాల చెప్పిన రియల్ లైఫ్ స్టోరీలో ‘ఆర్ఎక్స్ 100’ ఛాయలు కనబడేసరికి వెంటనే ‘గుణ 369’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

రెండవ సినిమా ‘హిప్పీ’ ఫ్లాప్ అయినా 3వ చిత్రంపై గట్టి నమ్మకముంచాడు. తాజాగా రీలీజైన ఇంటెన్స్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో కూడా సినిమాలో ఏదో విషయం ఉన్నట్టుంది, ఇంకో ‘ఆర్ఎక్స్ 100’ సూచనలున్నాయి అనే ఉద్దేశ్యాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ పాజిటివ్ ఒపీనియన్ తగ్గకముందే టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచాలని భావిస్తోంది టీమ్. రేపు సోమవారం ఉదయం 11 గంటల 11 నిముషాలకు టీజర్ విడుదలకానుంది. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More