‘రుద్రమదేవి’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసిన గుణశేఖర్

Rudhramadevi
గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన ‘రుద్రమదేవి’ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ చివరకు అక్టోబర్ నెలకు ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. భారతదేశపు మొట్టమొదటి ౩డీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు, తమిళం, మళయాలం, హిందీ.. ఇలా నాలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాత గుణశేఖర్ ప్లాన్ చేశారు.

అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు.. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే విజువల్ ఫీస్ట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జరిగిన జాప్యం వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నీ దాదాపుగా పూర్తవ్వడంతో రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న అక్టోబర్ 9కే ఫిక్స్ చేసేశారు. ఇక సినిమా యూనిట్ కూడా ఇప్పటికే మొదలుపెట్టిన ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనుంది.

Exit mobile version