సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా ‘శకుంతలం’ అనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయకిగా సమంత లేదా పూజా హెగ్డేను సంప్రదించినట్టు తొలుత వార్తలొచ్చాయి. కానీ కథానాయిక పాత్ర కోసం తాము టాలీవుడ్ హీరోయిన్లను కాంటాక్ట్ కాలేదని చిత్ర నిర్మాత, గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ క్లారిటీ ఇచ్చారు. దీంతో గుణశేఖర్ బాలీవుడ్ హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నట్టు టాక్ మొదలైంది. ఎందుకంటే సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి హిందీ హీరోయిన్ అయితే రీచ్ బాగుంటుందని భావించి గుణశేఖర్ బాలీవుడ్ దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు.
మరి అంతా అనుకుంటున్నట్టు గుణశేఖర్ హిందీ నటినే తీసుకుంటారా లేకపోతే తెలుగు కథానాయికతోనే సినిమా చేస్తారో చూడాలి. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు గుణశేఖర్. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కథాంశం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తికాగానే రానాతో భారీ బడ్జెట్ చిత్రం ‘హిరణ్యకశ్యప’ను మొదలుపెడతారు గుణశేఖర్.


