70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ అవార్డుల విజేతలు వీరే !

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ అవార్డుల విజేతలు వీరే !

Published on Feb 22, 2026 8:00 AM IST

filmfare

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 70వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్ అవార్డ్స్ వేడుక నిన్న రాత్రి కేరళలోని కొచ్చిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలను ఎంపిక చేసి, వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేయడం జరిగింది. మరి ఎవరికి ఏ అవార్డు వచ్చిందో చూద్దాం రండి.

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) విజేతలు వేరే!

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్‌ (సత్యభామ)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జ (హను-మాన్)

బెస్ట్ డెబ్యూ ఫిమేల్ – నయన్ సారిక (గం గం గణేశ)

బెస్ట్ డెబ్యూ మేల్ – సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – యాధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)

ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి- గుంటూరు కారం)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు (చుట్టమల్లె – దేవర: పార్ట్ 1)

బెస్ట్ లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె – దేవర: పార్ట్ 1)

బెస్ట్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్‌ ( కుర్చీ మడతపెట్టి – గుంటూరు కారం)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనికా (పుష్ప 2: ది రూల్) & నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 AD)

తాజా వార్తలు