
టాలీవుడ్ లో భారీ సెట్టింగులు వేసే డైరెక్టర్ గ పేరు తెచ్చుకున్న గుణశేఖర్ దాదాపు రెండేళ్ళు కష్టపడి చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని తెచ్చి పెట్టి గుణశేఖర్ ని ఆ రుద్రమదేవి టెన్షన్ నుంచి కాస్త పక్కన పడేసింది. రిలీజ్ తర్వాత పలు ప్రమోషనల్ ఈవెంట్స్ లో బిజీగా ఉన్న గుణశేఖర్ ఇప్పుడు కాస్త రిలాక్స్ అయినట్టు ఉన్నారు. అందుకే ఆయన తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు.
దృష్టి పట్టడమే కాదు అప్పుడే గుణ టీం వర్క్స్ బ్యానర్ పై ఓ టైటిల్ ని కూడా రిజిష్టర్ చేసాడు. ఆ సినిమా టైటిల్ ‘వీరాభిమన్యు’. చెప్పాలంటే ఇదొక చారిత్రాత్మక పేరు. భారతంలోని అర్జునిడి కుమారుడి పేరే వీరాభిమన్యు. గుణశేఖర్ ఈ టైటిల్ ని రిజిష్టర్ చేయడంతో గుణ మళ్ళీ పీరియడ్ ఫిల్మ్ తీస్తున్నాడా, లేక రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి ఈ టైటిల్ ని ఎంపిక చేసాడా అన్నది అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది. ఇది కాకుండా రుద్రమదేవి సినిమాకి సీక్వెల్ గా ప్రతాప రుద్రుడు సినిమాని కూడా లిస్టు లో ఉంది. మరి ఈ రెండిటిలో గుణశేఖర్ నెక్స్ట్ ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడు అనేది చూడాలి..