గుణ శేఖర్.. తెలుగులో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఒకరు. ఈమధ్యే వచ్చిన రుద్రమదేవి సినిమాతో పెద్ద సాహసమే చేసి మెప్పించిన గుణ శేఖర్, తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు ఒక కొత్త దారిని చూపిన దిగ్దర్శకుడు కె.వి.రెడ్డి స్మారకంగా ఇచ్చే అవార్డుకు ఎంపికయ్యారు. కళావాహిని ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఈ అవార్డుల్లో భాగంగా ఈ సంవత్సరానికి గుణ శేఖర్ ఎంపికయ్యారు. 30 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ అవార్డులు తెలుగులో విపరీతమైన ఖ్యాతి గడించాయి.
హైద్రాబాద్‌ల్ డిసెంబర్ 13న ఈ అవార్డు ప్రదాన కారక్రమాన్ని నిర్వహించనున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు చేతులమీదుగా గుణ శేఖర్ ఈ అవార్డును అందుకోనున్నారు. పలువురు సినీ, రాజకీయ్ ప్రముఖుల సమక్షంల్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగనుంది. ఇక ప్రతిష్టాత్మక కెవి రెడ్డి అవార్డు తనకు రావడం పట్ల గుణ శేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.


