
చాలా కాలం నుంచి ఇదిగో, అదిగో అని తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ ఎంతో రీసర్చ్ చేసి మూడేళ్ళు కష్టపడి చేసిన ఈ సినిమాని ఎట్టకేలకు అక్టోబర్ 9న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. పక్కాగా ఖరారు చేసినా ఈ సినిమా మళ్ళీ వాయిదా పడచ్చు, 3డి రిలీజ్ కాదు , కేవలం 2డి వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరోసారి ఈ వార్తలన్నిటికీ గుణశేఖర్ ఫుల్ స్టాప్ పెట్టాడు.
‘3డి వెర్షన్ రిలీజ్ కాదు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అనుకున్న దాని ప్రకారం అక్టోబర్ 9న 2డి మరియు 3డి వెర్షన్స్ రెండూ రిలీజ్ అవుతాయి. అది కూడా అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుందని’ గుణశేఖర్ మరోసారి చెప్పాడు. చాలా సార్లు వాయిదా పడినప్పటికీ ఈ భారీ చారిత్రాత్మక సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలనాటి వీరనారి రుద్రమదేవి పాత్రలో అనుష్క కనిపించనుంటే, అల్లు అర్జున్ గోనగన్నా రెడ్డిగా, రానా దగ్గుబాటి చాళుక్య వీరభద్రుడిగా కనిపించనున్నాడు. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు.

