రానా తో గుణశేఖర్ “హిరణ్య కశ్యప” భారీ పౌరాణిక మూవీ

Published on Jun 2, 2019 12:00 am IST

డైరెక్టర్ గుణశేఖర్ పేరు వింటే అబ్బురపరిచే సెట్టింగ్స్ తో భారీతనం కొట్టేచేలా చిత్రీకరించే విజువల్స్ గుర్తుకు వస్తాయి. అనుష్క ప్రధాన పాత్రలో “రుద్రమ దేవి”లాంటి చారిత్రాత్మక మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ భారీ చిత్రాల దర్శకుడు ఈ రోజు ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఇండస్ట్రీ మొత్తం తన గురించి మాట్లాడుకొనేలా చేశాడు.
దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో “హిరణ్య కశ్యప” అనే పౌరాణిక గాథను తెరకెక్కిస్తున్నట్లు ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. హిరణ్య కశిపుడు పురాణాల్లో రాక్షసుడు, ప్రహ్లాదుడి తండ్రి. శివ భక్తుడైన హిరణ్య కశిపుడు నరసింహావతారంలో వచ్చిన విష్ణువు చేతిలో మరణిస్తాడు.

మరి రానా ఈ భారీ ప్రాజెక్టులో నెగెటివ్ షేడ్స్ ఉండే హిరణ్య కశిపుడిగా కనిపిస్తాడా లేక, ఆ పాత్ర స్పూర్తితో గుణశేఖర్ ఫిక్షనల్ స్టోరీ ఏదైనా రెడీ చేశాడా తెలియాల్సి వుంది. ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తా అన్నారు గుణశేఖర్.

సంబంధిత సమాచారం :

More