సన్ రైజర్స్ కాంట్రవర్సీ: నేను ఆర్సీబీ వైపు అంటున్న బిగ్ బాస్ అభిజీత్

సన్ రైజర్స్ కాంట్రవర్సీ: నేను ఆర్సీబీ వైపు అంటున్న బిగ్ బాస్ అభిజీత్

Published on Mar 13, 2026 10:00 PM IST

RCB

మన తెలుగు ఆడియెన్స్ కి మాత్రమే కాకుండా భారత జనాభా అంతటికీ సినిమాతో పాటుగా మరో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది క్రికెట్ అనే చెప్పాలి. మొన్న టీ 20 వరల్డ్ కప్ అయ్యింది. ఇందులో భారత్ విజయాన్ని దేశం అంతా సంబరంగా జరుపుకున్నారు. ఇక దీని తర్వాత మరో సెన్సేషనల్ టీ 20 ఫార్మాట్ ఐపీఎల్ మొదలైంది.

అయితే దీని షెడ్యూల్ కూడా బయటకి వచ్చింది. ఈ గ్యాప్ లో మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల నడుమ జరగనుంది. కానీ ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. దీనితో ఈ మ్యాచ్ కి మాత్రం తమ సపోర్ట్ అంతా బెంగళూర్ జట్టుకే అని చెబుతున్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్ లో బిగ్ బాస్ సెన్సేషన్ అభిజీత్ కూడా చేరాడు. హోమ్ టీం హైదరాబాద్ ని కాదు అని మన తెలుగు వాళ్ళు కూడా ఎందుకు బెంగళూరుకు సపోర్ట్ చేస్తున్నారంటే దానికి గట్టి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే పాకిస్తాన్ కి చెందిన ఓ బౌలర్ ని హైదరాబాద్ జట్టులో తీసుకోవడమే. అబ్రార్ అహ్మద్ అనే ఈ పాకిస్తానీ స్పిన్నర్ ని సగౌరంగా హైదరాబాద్ యాజమాన్యం తీసుకోవడం గమనార్హం.

అతడు భారత ఆర్మీపై, ఆపరేషన్ సిందూర్ పై వ్యంగ్యంగా పోస్ట్ లు వేయడం కూడా చేసాడు. అలాంటి ప్లేయర్ ని ఎలా హైదరాబాద్ జట్టులో తీసుకుంటారు అని ఇదేనా దేశానికి ఇచ్చే గౌరవం అంటూ గట్టి విమర్శలు చేస్తూ యాజమాన్యాన్ని ఛీదరిస్తున్నారు. ఇందుకే అభిజీత్ కూడా బాహాటంగానే ఇక నుంచి తన సపోర్ట్ ఆర్సీబీకి అంటూ పోస్ట్ చేయడం ఇప్పుడు తెలుగు యువతలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు