‘గుంటూరు కారం’ : ఫ్యాన్స్ కి స్వీట్ అప్ డేట్ అందించిన థమన్

‘గుంటూరు కారం’ : ఫ్యాన్స్ కి స్వీట్ అప్ డేట్ అందించిన థమన్

Published on Nov 11, 2023 7:00 PM IST

Guntur Kaaram 2
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అయిన దమ్ మసాలా అందరి నుండి విశేషమైన స్పందన అందుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, ఆలీ, రఘుబాబు వంటి వారు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.

విషయం ఏమిటంటే స్వీట్ స్పైస్ అంటూ కొద్దిసేపటి క్రితం థమన్ తన ట్విట్టర్ అకౌంట్ లో మిర్చి ఎమోజిని జోడిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అయితే రేపు దీపావళి పండుగని పురస్కరించుకుని ఈ మూవీ నుండి మంచి డ్యూయెట్ సాంగ్ అప్ డేట్ లేదా ఒక పోస్టర్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. మరి థమన్ పోస్ట్ ప్రకారం దీపావళి సందర్భంగా గుంటూరు కారం నుండి ఎటువంటి సర్ప్రైజ్ ఉంటుందో చూడాలి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

తాజా వార్తలు