‘గుంటూరు కారం’ : ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ, సక్సెస్ మీట్ ఇక్కడ ?

‘గుంటూరు కారం’ : ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ, సక్సెస్ మీట్ ఇక్కడ ?

Published on Dec 27, 2023 12:55 AM IST

guntur kaaram 4
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా ప్రముఖ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, రఘుబాబు, సునీల్, బ్రహ్మానందం, హైపర్ ఆది నటిస్తున్నారు.

జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీగా అంచనాలు ఏర్పరిచాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించేందుకు టీమ్ సిద్ధమవుతోందని, అలానే రిలీజ్ అనంతరం సక్సెస్ మీట్ ని గుంటూరు లో జరిపేందుకు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై గుంటూరు కారం మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది.

తాజా వార్తలు