“గుర్తుందా శీతాకాలం” ట్రైలర్ విడుదల కి సిద్ధం

Published on Feb 13, 2022 3:40 pm IST

సత్యదేవ్ కంచరాన, తమన్నా భాటియా లు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రాన్ని నాగ శేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీ వేద అక్షర మూవీస్ పతాకాల పై భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ ను రేపు ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :