జీవీ ప్రకాష్ ‘త్రిష లేదా నయనతార’ రిలీజ్ డేట్

Trisha-Ledha-Nayanatara
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ అల్లుడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి సంగీత దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న జీవి ప్రకాష్ కుమార్, తాజాగా హీరోగానూ మెప్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తమిళంళో జీవీ ప్రకాష్ హీరోగా రూపొందిన ‘త్రిష ఇళ్ళై నయనతార’ చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచి, ప్రకాష్‌కు హీరోగా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడీ సినిమాను ‘త్రిష లేదా నయనతార’ తెలుగులో రుషి మీడియా విడుదల చేస్తోంది. ఆదిక్ రవి చంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో దీపావళి కానుకగా విడుదల కానుంది.

జీవి ప్రకాష్ స్వయంగా సంగీతం సమకూర్చిన ఈ సినిమా తెలుగు వర్షన్‌కు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న హైద్రాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు జీవీ ప్రకాష్, హీరోయిన్ ఆనంది తదితరులు హాజరయ్యారు. ఇక తమిళంలోలానే తెలుగులోనూ త్రిష్ లేదా నయనతార మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని జీవి ప్రకాష్ వ్యక్తం చేశారు. నవంబర్ 5న దీపావళి సీజన్‌కు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నామని, తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version