
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో(వర్కింగ్ టైటిల్)’. విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ వరకూ లండన్ లోనే జరగనున్న షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ 70% పూర్తవుతుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోవడమే కాకుండా బిజినెస్ పరంగా ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలకి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. మాకు అందిన న్యూస్ ప్రకారం ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నైజాం మరియు కృష్ణా జిలా రైట్స్ కోసం నిర్మాతలకి సుమారు 18 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.
ఒక్క నైజాం, క్రిష్ణానే కాదు అని ఏరియాలకి సంబందించిన రైట్స్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ చిత్ర నిర్మాతలు రైట్స్ విషయంలో తొందరపడకుండా మంచి రేటుకు, అలాగే గ్రాండ్ రిలీజ్ ఉండేలా ప్లాంక్ చేస్తున్నారు. దాదాపు 90% షూటింగ్ అబ్రాడ్ లో జరగనున్న ఈ సినిమాని 2016 సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ ఇస్ంగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడమే కాకుండా ఓ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

