నితిన్ సరసన హన్సిక ?

నితిన్ సరసన హన్సిక ?

Published on Jun 25, 2018 1:12 PM IST

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్ పెట్టారు.’సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నితిన్ సరసన హన్సికను హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే నితిన్ హన్సిక ‘సీతారాముల కళ్యాణం లంకలో’ అనే చిత్రంలో కలిసి నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.

దర్శకుడు వెంకీకుడుముల చెప్పిన కథ హన్సికకు బాగా నచ్చి వెంటనే డేట్స్ అడ్జెస్ట్ చేశారట.ఈ చిత్రాన్ని ఆగష్టులో అధికారికంగా లాంఛ్ చేయనున్నారు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ప్రస్తుతం నితిన దిల్ రాజు నిర్మాణంలో జరుగుతున్న’శ్రీనివాస కళ్యాణం’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు