మరో కొత్త ప్రాజెక్ట్ కి సంతకం చేసిన హన్సిక

మరో కొత్త ప్రాజెక్ట్ కి సంతకం చేసిన హన్సిక

Published on Jul 8, 2015 11:38 PM IST

Hansika
బల్బీ బ్యూటీ హన్సిక మరో తమిళ ప్రాజెక్ట్ ని అంగీకరించింది. ప్రస్తుతం ఈ భామ చేతి నిండా సినిమాలు వుండడం విశేషం. కొన్ని సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా వున్నాయి.

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం హిందీ సినిమా ‘జాలీ LLB’ యొక్క తమిళ రిమేక్ లో హీరోయిన్ గా ఈ భామని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. అహ్మద్ దర్శకుడు. ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రధారి. యువ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ స్వరాలను సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

తాజా వార్తలు